కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విభాగం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా జూనియర్ అసిస్టెంట్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏడో తరగతి, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సరైన అర్హత గల అభ్యర్ధులు తమ దరఖాస్తుకు అన్ని సర్టిఫికేట్‌లను జతపరచి నవంబర్ 20 తేది లోగా సంబంధిత చిరునామాకు పంపవలెను.

వివరాలు..

1.జూనియర్ అసిస్టెంట్: 01 పోస్టుఅర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.వయోపరిమితి: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.జీతం: నెలకు రూ.18500. 

2. లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 05 పోస్టులుఅర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.వయోపరిమితి: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.జీతం: నెలకు రూ.15000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, విద్య అర్హత సర్టిఫికెట్ల కాపీలను జతపరచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపవలెను.

ఆఫ్‌లైన్ దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  అసిస్టెంట్ కమిషనర్(సెల్: 7702253442), స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, శాంతినగర్, కాకినాడ -533003.

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022. 

 

Notification 

Website 

Also Read:

పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే!దేశంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు తెరలెపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 98,083 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.  పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో అప్రెంటిస్‌షిప్ మేళా - డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత!హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది. డిప్లొమా, బీటెక్, ఏదైనా సాధారణ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరుకావచ్చు. నవంబరు 10న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. అప్రెంటిస్ మేళా పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

జిప్‌మర్‌‌లో 456 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్‌మర్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు డిసెంబర్ 1లోగా దరఖాస్తుచేసుకోవాలి. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...