తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కొనసాగుతోంది. ఓవైపు నిందితులను ప్రశ్నిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సిట్ అధికారులు ఏప్రిల్ 4న విచారణ చేపట్టారు. మొత్తం 5 బృందాలుగా ఏర్పడిన అధికారులు మల్యాల మండలంలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రశ్నించారు.


గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో దాదాపు 40 మంది అర్హత సాధించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారి ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. అభ్యర్థుల విద్యార్హతలు, గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులు, ఎక్కడ శిక్షణ తీసుకున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, బంధువులు, స్నేహితుల వివరాలను సేకరించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో అభ్యర్థులకు ఏమైనా స్నేహం, బంధుత్వం ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు.


తాటిపల్లిలోనూ విచారణ..
రాజశేఖర్ రెడ్డి స్వగ్రామమైన తాటిపల్లిలోనూ సిట్ అధికారులు విచారించారు. మల్యాల మండలంలో వంద మందికి 100 మార్కులకు పైగా వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సిట్ అధికారులు మల్యాల మండలానికి చెందిన గ్రూప్-1 అభ్యర్థులపై దృష్టి పెట్టారు. సిట్ అధికారులు ఇప్పటికే 15 మంది నిందితులను ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కమిషన్ కార్యదర్శి అనితా రాంచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి నుంచి నిన్న సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకున్న విషయం తెలిసిందే.


Also Read:


పేపర్ లీకేజీ కేసులో కమిషన్‌ ఛైర్మన్‌ను విచారించిన 'సిట్' అధికారులు! కీలక విషయాలు నమోదు!
తెలంగాణలో తీవ్ర కలకలం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు స్పీడ్ పెంచింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని సిట్ అధికారులు ఏప్రిల్ 3న విచారించారు. దాదాపు 3 గంటలపాటు ఆయనను ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక విషయాలను నమోదు చేసుకున్నారు. ఈ కేసులో జనార్ధన్ రెడ్డి స్టేట్ మెంట్ కీలకం కానుంది. కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి నిందితులు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ తస్కరించడం నుంచి ప్రశ్నపత్రాల లీక్ వరకు జరిగిన పరిణామాలపై ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కమిషన్‌లో పనిచేసే ఉద్యోగుల విధివిధానాలు, ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!
తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం కష్టపడి చదివిన నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. రాత్రింభవళ్లు చదివి.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించివారైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎవరో చేసిన పాపం, తమకు శాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలాగైనా సర్కారు కొలువు కొట్టి కుటుంబానికి అండగా నిలబడాలని భావించే వారి వ్యతలు చెప్పుకోలేనివి. భద్రాచలానికి చెందిన భవానీది ఇదే పరిస్థితి. చిన్ననాటి నుంచే దివ్యాంగురాలైన భవాని సరిగా మాట్లాడలేదు, చెవులు కూడా సరిగా వినపడవు. అయినప్పటికీ కష్టపడి చదివి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసింది, మెయిన్స్‌కు అర్హత కూడా సాధించింది. తీరా గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించడంతో వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...