SIDBI Jobs Notification: లక్నోలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బి) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా ఎల్‌ఎల్‌బీ లేదా సీఏ/ సీఎస్‌/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతోపాటు తగిన పని అనుభవం కలిగి ఉండాలి.


సరైన అర్హతలున్నవారు నవంబరు 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ మాత్రం లక్నో, ముంబయి, న్యూ ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో నిర్వహిస్తారు.

వివరాలు..

* అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు (గ్రేడ్ ‘ఎ’ - జనరల్ స్ట్రీమ్)

ఖాళీల సంఖ్య: 50 


పోస్టుల కేటాయింపు: ఎస్సీ: 08, ఎస్టీ: 04, ఓబీసీ: 11, ఈడబ్ల్యూఎస్: 05, జనరల్: 22, దివ్యాంగులకు: 03. 

అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. ఎల్‌ఎల్‌బీ లేదా సీఏ/ సీఎస్‌/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: 08.11.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్) 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఓబీసీ) అభ్యర్థులకు 13 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు 15 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 

దరఖాస్తు ఫీజు: రూ.1100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ - విజయవాడ, అరుణాలచల్ ప్రదేశ్ - నహర్‌లగూన్, అస్సామ్ - గువాహటి, బిహార్ - పాట్నా, ఛండీఘడ్-మొహాలి, ఛత్తీస్‌గడ్-రాయ్‌పూర్, సూరత్, ఢిల్లీ/ఢిల్లీ NCR, గోవా - పనాజీ, గుజరాత్ - అహ్మదాబాద్-గాంధీనగర్, హర్యానా - ఫరీదాబాద్, హిమాచల్ ప్రదేశ్ - సిమ్లా, జమ్మూ & కశ్మీర్ - జమ్మూ, ఝూర్ఖండ్ - రాంచీ, కర్ణాటక - బెంగళూరు, కేరళ - తిరువనంతపురం, లడఖ్ - లేహ్, మధ్యప్రదేశ్ - భోపాల్, మహారాష్ట్ర - ముంబయి, మణిపూర్ - ఇంఫాల్, మేఘాలయ - షిల్లాంగ్, మిజోరం - ఐజ్వాల్, నాగాలాండ్ - కోహిమా, ఒడిశా - భువనేశ్వర్, పుదుచ్చేరి, పంజాబ్ - పాటియాలా, రాజస్థాన్ - జైపూర్, సిక్కింగ్ - గాంగ్‌టక్, తమిళనాడు - చెన్నై, తెలంగాణ - హైదరాబాద్, త్రిపుర - అగర్తలా, డెహ్రాడూన్, ఉత్తర్ ప్రదేశ్ - లక్నో, వెస్ట్ బెంగాల్ - కోల్‌కతా.

పే స్కేల్: నెలకు రూ.90,000.


ముఖ్య తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.11.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.11.2023.


➥ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 2023/ జనవరి 2024.


Notification


Online Application


Website


ALSO READ:


➥ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


➥ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు


➥ గుంటూరు జిల్లాలో మెడికల్, పారామెడికల్ పోస్టులు - ఈ అర్హతలుండాలి


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...