SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1031 ఉద్యోగాలు, వీరికి ప్రత్యేకం!

ఈ నోటిఫికేషన్ ద్వారా ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్, ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Continues below advertisement

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1031 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్, ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమరావతి పరిధిలో 69 పోస్టులు, హైదరాబాద్ పరిధిలో 45 పోస్టులు ఉన్నాయి.

Continues below advertisement

వివరాలు..

* ఖాళీల సంఖ్య: 1031 (అమరావతి-69, హైదరాబాద్-45)

పోస్టుల కేటాయింపు: జనరల్-502, ఓసీబీ-244, ఎస్సీ-143, ఎస్టీ-59, ఈడబ్ల్యూఎస్-83.

ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్: 821 పోస్టులు

జీతం: 36,000.

ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్: 172 పోస్టులు

జీతం: రూ.41,000.

సపోర్ట్ ఆఫీసర్: 38 పోస్టులు

జీతం: రూ.41,000.

అర్హతలు: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగై ఉండాలి. ఏటీఎం ఆపరేషన్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

Notification

Online Application 

Website

                                 

Also Read:

ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌లో 50 ఫీల్డ్‌ ఇంజినీర్‌ ఖాళీలు
సత్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎన్‌జేవీఎన్) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రింట్అవుట్‌ను మే 19 వరకు పంపించాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement