దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో ఏపీలో 390 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 125 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఖాళీల భర్తీకి సెప్టెంబరు 1న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 21తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయినవారు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


* ఎస్‌బీఐ - అప్రెంటిస్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 6160 (ఏపీ-390, తెలంగాణ-125)


కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ- 1389, ఈడబ్ల్యూఎస్- 603, జనరల్- 2,665 చొప్పున ఉన్నాయి. 


అర్హత:  ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. 


వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 


స్టైఫండ్: ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ ఏడాది కాలం పాటు నెలకు ₹15 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఇతర అలవెన్సులకు అర్హులు కాదు.


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.09.2023.


* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.09.2023.


* దరఖాస్తు వివరాల్లో సవరణకు చివరితేది: 21.09.2023.


* దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 06.10.2023


ఆన్‌లైన్ రాత పరీక్ష అక్టోబర్/నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.


Notification


Online Application


ALSO READ:


ఎస్‌బీఐలో 439 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులు, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 439 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 6లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ అర్హతతో 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఈ పోస్టుల‌ను ఐడీబీఐ భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంట‌ర్న్‌షిప్‌, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..