స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


పోస్టుల వివరాలు..


మేనేజ్‌మెంట్ ట్రైనీ(టెక్నికల్): 245 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


1) మెకానికల్ ఇంజినీరింగ్: 65 


2) మెటలర్జికల్ ఇంజినీరింగ్: 52


3) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 59


4) ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 13


5) మైనింగ్ ఇంజినీరింగ్: 26


6) కెమికల్ ఇంజినీరింగ్: 14


7) సివిల్ ఇంజినీరింగ్: 16


అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి.


వయోపరిమితి: 23.11.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.


జీత భత్యాలు: రూ.60,000 - రూ.1,80,000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు:  రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.


ఎంపిక ప్రక్రియ:  గేట్-2022 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03.11.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.11.2022.


Notification

Online Applications 


Website 


Also Read:


కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఉద్యోగాలు, అర్హతలివే
కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విభాగం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా జూనియర్ అసిస్టెంట్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏడో తరగతి, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సరైన అర్హత గల అభ్యర్ధులు తమ దరఖాస్తుకు అన్ని సర్టిఫికేట్‌లను జతపరచి నవంబర్ 20 తేది లోగా సంబంధిత చిరునామాకు పంపవలెను.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


చిత్తూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 5న ప్రారంభంకాగా.. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 710 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 1 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...