స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* అటెండెంట్-కమ్-టెక్నీషియన్ ట్రైనీ: 146 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-56, ఎస్సీ-16, ఎస్టీ-45, ఓబీసీ-16, ఈడబ్ల్యూఎస్-13.
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఏడాది పాటు అప్రెంటిస్ షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీచేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 15.09.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.200. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్-40 ప్రశ్నలు-40 మార్కులు, లాజికల్ రీజనింగ్-30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.09.2022.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.09.2022.
- పేమెంట్ రీకన్సిలియేషన్ స్టేటస్-ఎడిట్ ఆప్షన్: ప్రకటించాల్సి ఉంది.
- పేమెంట్ ఎడిటింగ్ ఆప్షన్: ప్రకటించాల్సి ఉంది.
- రీకన్సిలియేషన్ స్టేటస్ ప్రకటన: వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు.
- అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు.
- రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: అడ్మిట్ కార్డులో పరీక్ష తేదీ ప్రకటిస్తారు.
Also Read:
SSC Stenographer Exam: ఇంటర్ అర్హతతో 'స్టెనోగ్రాఫర్' ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...