RRC-West Central Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


వివరాలు..


* అప్రెంటిస్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 2521 పోస్టులు


డివిజన్‌ల వారీగా ఖాళీలు..


1. జబల్పూర్ డివిజన్: 884 పోస్టులు


2. భోపాల్ డివిజన్: 614 పోస్టులు


3. కోట డివిజన్: 685 పోస్టులు


4. కోట వర్క్‌షాప్ డివిజన్: 160 పోస్టులు


5. సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్(CRWS BPL) డివిజన్: 158 పోస్టులు


6. హెచ్‌క్యూ/ జబల్‌పూర్ డివిజన్: 20 పోస్టులు


అర్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. సంబంధిత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.


వయోపరిమితి: 17.11.2022 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తుల సమర్పణ, ప్రింటింగ్ తీసుకునే సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 08125930726  ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.


ఈమెయిల్: rrc.jblpr2022@gmail.com


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/ఈ-వాలెట్లు & మొదలైన వాటి ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.


ఎంపిక ప్రక్రియ: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు, ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 18.11.2022.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17.12.2022.


Notification   
Online Application  
Website          


Also Read:


NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నోయిడాలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. సంబధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 30 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


KIOCL Recruitment: కేఐఓసీఎల్‌లో జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ పోస్టులు - అర్హతలివే!
బెంగళూరులోని కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (KIOCL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులని మైనింగ్, ఫైనాన్స్, మెటీరియల్, కమర్షియల్, ఎలక్ట్రికల్, ట్రైనింగ్ అండ్ సేఫ్టీ, జియాలజీ, స్ట్రక్చరల్, సర్వే విభాగాలలో భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 3 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...