RRB Technician Recruitment 2024: దేశంలోని నిరుద్యోగ యువతీ యువకులకు రైల్వేశాఖ శుభవార్త వినిపించింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఫిబ్రవరి 17న సంక్షిప్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్ల పరిధిలోని ఖాళీలను భర్తీచేయనున్నారు.


టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 9 నుంచి పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆయా రైల్వే రీజియన్ల వెబ్‌సైట్‌లలో నోటిఫికేషన్ అందబాటులో ఉంచనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఆన్‌లైన్‌  ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేపడతారు. రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్‌ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదలకానున్నాయి.


వివరాలు..


🔰 టెక్నీషియన్ పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య: 9,000.


➥ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1,100 పోస్టులు


➥ టెక్నీషియన్ గ్రేడ్-III: 7,900 పోస్టులు


వయోపరిమితి: 01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 సంవత్సరాలు; టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం:  సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.


ముఖ్యమై తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.04.2024.



ALSO READ:


'అగ్నివీరుల' నియామకానికి ఏఆర్‌వో-సికింద్రాబాద్‌ నోటిఫికేషన్ - దరఖాస్తు ఎంపిక వివరాలు ఇలా
సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 'అగ్నిపథ్' స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. దరఖాస్తుల సమర్పణకు మార్చి 22 వరకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టులు నిర్వహించి తుదిఎంపిక చేస్తారు. ఎంపికైనవారు నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు కచ్చితంగా నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000, మూడో సంవత్సరం నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 చొప్పున ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం. నాలుగేళ్లు సర్వీసు తర్వాత 'సేవా నిధి ప్యాకేజీ' కింద రూ.10.04 లక్షలు ఇస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...