హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికు చెందిన రిలయన్స్‌ జియో సంస్థ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉన్నవారు ఉద్యోగాలకు అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా జూన్ 24వ తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావాలి.


వివరాలు...


* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు


అర్హత: ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉండాలి.


పని అనుభవం: కనీసం 0-1 ఏడాది పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.


జీతభత్యాలు: సంవత్సరానికి రూ.లక్ష - రూ.1.75లక్షలు చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: JIO Center, 
                                2nd Floor, VC Plaza,
                                Opp:- BJP Office, Main Road, 
                                Kukatpally, Hyderabad.


ఇంటర్వ్యూ తేదీ: 24.06.2023.


ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు.


Also Read:


నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో 73 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీ) జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ వైవా ద్వారా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!
విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial