PM Internship Scheme 2024 Registration Date: దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ గడువు ముగిసినప్పటికీ దాన్ని నవంబర్ 15 వరకు పెంచింది కేంద్రం. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా విద్యార్థులకు పెద్ద సంస్థల్లో అప్రెంటిస్‌లుగా చేరేందుకు అవకాశం కల్పించనుంది. 21 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. కంపెనీలు నవంబర్ 27న తుది ఎంపిక నిర్వహిస్తాయి. ఇంటర్న్‌షిప్ 2డిసెంబర్ 2024 నుంచి ప్రారంభమవుతుంది.
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద ఈ ఏడాదికి వివిధ కంపెనీల్లో అప్రెంటిస్‌లుగా చేరేందుకు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. 3 అక్టోబర్ 2024 నుంచి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని గడువు ముగిసినప్పటికీ మరింత మందిని ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆగడువును మరో నాలుగు రోజులు పెంచింది. ఇప్పటి వరకు దాదాపు 50,000 మందికిపైగా ఈ స్కీమ్ కింద అప్లే చేసుకున్నారు.
అక్టోబర్ 3న ఇంటర్న్‌షిప్ పోర్టల్ ప్రారంభించారు. అప్పటి నుంచి 193 కంపెనీలు యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించేందుకు సిద్దమయ్యాయి. మారుతీ సుజుకి ఇండియా, ఐషర్ మోటార్, ఎల్ అండ్ టి (లార్సెన్ & టూబ్రో), రిలయన్స్ ఇండస్ట్రీస్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, ఐషర్ మోటార్స్, లార్సెన్ & టూబ్రో, టెక్ మహీంద్రా, మహీంద్రా & మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి అగ్రశ్రేణి ప్రైవేట్ రంగ దిగ్గజాలు సహా 130 కంపెనీలు తం సంస్థల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ అవకాశాలు 24 విభిన్న రంగాల్లో ఉన్నాయి.ఆయిల్, గ్యాస్ & ఎనర్జీ రంగం టాప్‌లో ఉంది. ట్రావెల్ & హాస్పిటాలిటీ తర్వాత స్థానంలో ఉంది. ఆటోమోటివ్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & కన్స్ట్రక్షన్, ఏవియేషన్ & డిఫెన్స్ కూడా పోటీలో ఉన్నాయి.
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి(PM Internship Scheme Apply Online)
pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
‘రిజిస్టర్’పై క్లిక్చేసి అవసరమైన వివరాలను ఇవ్వాలి.
తర్వాత సిస్టమ్ ఓ రెజ్యూమ్ క్రియేట్ చేస్తుంది.
సెక్టార్, లొకేషన్, అర్హతల ప్రాధాన్యతలు పేర్కొంటుది
ఐదు ప్రాధాన్య ఇంటర్న్‌షిప్స్‌లో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తు సమర్పించి, అప్లికేషన్‌ను పేజీని డౌన్‌లోడ్ చేయండి.
36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 650 జిల్లాల్లో ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని నలుమూల విద్యార్థులు ఈ పథకం కింద అవకాశాలు పొందగలరు. PM ఇంటర్న్‌షిప్ పథకం కింద ఇంటర్న్‌షిప్ కోసం ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సహాయం అందుకుంటారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 90,849 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
ఇంటర్న్‌షిప్ పథకంలో చేరడానికి అర్హత ఏమిటి?
ఈ పథకంలో భాగం కావాలంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికెట్, పాలిటెక్నిక్ డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ అయినా చేసి ఉండాలి. ఉద్యోగం చేస్తున్న వాళ్లు, రెగ్యులర్ డిగ్రీ హోల్డర్లు ఇందులో చేరే అవకాశం లేదు. ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకంలో భాగమైన వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష యోజన (సుర్ఖా యోజన) పథకం ప్రయోజనాలు లభిస్తాయి.
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కోసం అర్హత ప్రమాణాలు(PM Internship Scheme 2024 eligibility)
దరఖాస్తు గడువు నాటికి 21-24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి భారతీయ పౌరుడు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు
ప్రస్తుతం నిరుద్యోగిగా ఉండాలి
రెగ్యులర్‌గా చదువుతున్న వాళ్లు అర్హులు కారు
ఆన్‌లైన్ లేదా దూరవిద్య విద్యార్థులు అర్హులు
ఈ పథకం ద్వారా కోటి మంది యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచించింది. దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకదానిలో సంవత్సరం పాటు పని చేయడానికి యువతకు అవకాశం ఉంటుంది, అక్కడ వారు నిజమైన వృత్తిపరమైన అనుభవం పొందనున్నారు.
Also Read: నేటికీ కొనసాగుతున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తి- అమల్లో ఉన్న విద్యా పథకాలు ఇవే
PM ఇంటర్న్‌షిప్ పథకం వివరాలు:(PM Internship Scheme Apply)
భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో 12 నెలల నిజ జీవిత అనుభవం.
భారత ప్రభుత్వం నెలకు రూ. 4500, పరిశ్రమల రూ. 500 చెల్లిస్తుంది
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీ ఉంటుంది.
pminternship.mca.gov.inలో ఇంటర్న్‌షిప్‌ల కోసం నమోదు చేసుకోవచ్చు,
ఐదేళ్లలో 10 మిలియన్ల నిపుణులను శక్తివంతం చేయడమే లక్ష్యం