సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 24
➥ ఎంటీఎస్(మెసెంజర్): 13
➥ ఎంటీఎస్(డాఫ్టరీ): 03
➥ కుక్: 02
➥ వాషర్‌మ్యాన్: 02
➥ మజ్దూర్: 03
➥ ఎంటీఎస్(గార్డనర్): 01
అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
వయోసరిమితి: 18-25 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.56,900 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:18.09.2023.
➥ దరఖాస్తుకు చివరితేదీ: 08.10.2023.
ALSO READ:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 95 నాన్ టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్-టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించి, అక్టోబరు 6లోగా దరఖాస్తు హార్డ్ కాపీలను నిర్ణీత చిరునామాకు చేరేలా పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్‌మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎస్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌బీఐ పీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..