తిరుపతిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కాంట్రాక్ట్ విధానంలో తిరుపతి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 25లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  వివరాలు.. ఖాళీల సంఖ్య: 09 ➥ జిల్లా కోఆర్డినేటర్: 01 పోస్టు అర్హత: కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో గ్రాడ్యుయేట్ లేదా సర్టిఫికేషన్ / డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషలో మంచి మౌఖిక & రాతపూర్వక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అనుభవం: కనీసం 2 సంవత్సరాలు. వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. జీతం: రూ.30,0OO పనిప్రదేశం: తిరుపతి. ➥ జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగాలలో డిగ్రీ లేదా పీజీడిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కంప్యూటర్ స్కిల్స్‌తోపాటు ఇంటర్నెట్/ఇమెయిల్ పరిజ్ఞానం ఉండాలి. స్థానిక భాషపై పట్టు ఉండాలి.

అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.

జీతం: రూ.18,0OO

పనిప్రదేశం: తిరుపతి.

➥ బ్లాక్ కోఆర్డినేటర్: 07 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషపై పట్టు ఉండాలి.

అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.

జీతం: రూ.20,0OO

పనిప్రదేశం: బ్లాక్‌లు(రేణిగుంట, పిచ్చాటూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, కోట, గూడూరు)

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తుకు చివరితేదీ: 25.11.2023.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  District Women &Child Welfare & Empowerment Officer. Room No.505-507, 5th Floor, B-Block Collector Otfice, Daminedu Tirupati- 517503, Tirupati District.

Notification & Application

Website

ALSO READ:

ప్రకాశం జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఉద్యోగాలుఒంగోలులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

అల్లూరి సీతారామరాజు జిల్లాలో డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు..పాడేరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒప్పంద ప్రాతిపదికన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

అన్నమయ్య జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఉద్యోగాలు..రాయచోటిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒప్పంద ప్రాతిపదికన అన్నమయ్య జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...