లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 17
పోస్టుల కేటాయింపు: జనరల్-12, ఎస్సీ-02, ఓబీసీ-02, ఈడబ్ల్యూఎస్-01.
1) ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్: 01
అర్హత: ఎంఎస్సీ (నర్సింగ్)/పీహెచ్‌డీ(నర్సింగ్).
అనుభవం: 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 12 సంవత్సరాలు టీచింగ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలకు మించకూడదు.
2) వైస్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్: 01
అర్హత: ఎంఎస్సీ (నర్సింగ్)/పీహెచ్‌డీ(నర్సింగ్).
అనుభవం: 12సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 10 సంవత్సరాలు టీచింగ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలకు మించకూడదు.
3) అసోసియేట్ ప్రొఫెసర్: 02
అర్హత: ఎంఎస్సీ (నర్సింగ్)/పీహెచ్‌డీ(నర్సింగ్)
అనుభవం: 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాలు టీచింగ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలకు మించకూడదు.
4) అసిస్టెంట్ ప్రొఫెసర్: 03
అర్హత: ఎంఎస్సీ (నర్సింగ్)/పీహెచ్‌డీ(నర్సింగ్)
అనుభవం: 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలకు మించకూడదు.
5) ట్యూటర్: 10
అర్హత: బీఎస్సీ నర్సింగ్/ఎంఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్/ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగాల్లో తగినంత అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.708 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ మూడోవారం/ చివరివారం, 2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్, 2022.
:: Also Read ::
ఐఐటీ కాన్పూర్‌లో 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ(కంప్యూటర్ అప్లికేషన్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 9లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.50 వేల జీతం!
ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) వివిధ విభాగాల్లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ, ఎంటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబరు 28లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..