Act Apprentice Recruitment: పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్) యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 09 వరకు దరఖాస్తులు సమర్సించవచ్చు. మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అప్రెంటిస్‌ల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 550
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 279, ఎస్సీ- 83, ఎస్టీ- 41, ఓబీసీ- 147.
ట్రేడుల వారీగా ఖాళీలు..
⏩ ఫిట్టర్: 200
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 101, ఎస్సీ- 30, ఎస్టీ- 15, ఓబీసీ- 54.
⏩ వెల్డర్(జీ&ఈ): 230
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 116, ఎస్సీ- 35, ఎస్టీ- 17, ఓబీసీ- 62.
⏩ మెషినిస్ట్: 05
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 03, ఎస్సీ- 01, ఎస్టీ- 00, ఓబీసీ- 01.
⏩ పెయింటర్(జీ): 20
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 10, ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ- 05.
⏩ కార్పెంటర్: 05
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 03, ఎస్సీ- 01, ఎస్టీ- 00, ఓబీసీ- 01.
⏩ ఎలక్ట్రీషియన్: 75
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 38, ఎస్సీ- 11, ఎస్టీ- 06, ఓబీసీ- 20.
⏩ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్: 15
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 08, ఎస్సీ- 02, ఎస్టీ- 01, ఓబీసీ- 04.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమానం(10+2 పరీక్షా విధానం కింద), సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.03.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.04.2024
ALSO READ:
1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
UPSC ESIC Nursing Officers: దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ESIC) కేంద్రాల్లో పని చేసేందుకు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1930 నర్సింగ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ) అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 7న ప్రారంభంకాగా.. మార్చి 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ ఉంటుంది. వీరు దేశంలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..