Just In





Punjab and Sind Bank: పంజాబ్ సింథ్ బ్యాంక్‌లో 158 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
పంజాబ్& సింథ్ బ్యాంక్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Punjab and Sind Bank Apprentice Notification: పంజాబ్& సింథ్ బ్యాంక్(Punjab & Sind Bank) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 158 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 చెల్లిస్తె సరిపోతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 158
రాష్ట్రాల వారీగా అప్రెంటిస్ ఖాళీలు..
➥ అరుణాచల్ ప్రదేశ్: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
➥ అస్సాం: 06 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఓబీసీ- 01, యూఆర్- 05.
➥ బీహార్: 15 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 02, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 08.
➥ హర్యానా: 20 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 03, ఓబీసీ- 05, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 10.
➥ మధ్యప్రదేశ్: 14 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 02, ఎస్టీ- 02, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 07.
➥ మణిపూర్: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
➥ మిజోరం: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
➥ నాగాలాండ్: 02 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 02.
➥ ఒడిశా: 10 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 01, ఎస్టీ- 02, ఓబీసీ- 01, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 05.
➥ రాజస్థాన్: 10 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 05.
➥ ఉత్తరప్రదేశ్: 55 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 11, ఓబీసీ- 14, ఈడబ్ల్యూఎస్- 05, యూఆర్- 25.
➥ వెస్ట్ బెంగాల్: 20 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 04, ఎస్టీ- 01, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 09.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం యొక్క స్థానిక భాష (చదవడం, రాయడం, మాట్లాడటం & అర్థం చేసుకోవడం) వచ్చి ఉండాలి. అప్రెంటిస్ అభ్యర్థులు 8వ తరగతి/10వ తరగతి/12వ తరగతి లేదా గ్రాడ్యుయేట్ లెవల్ స్టాండర్డ్ మార్క్ షీట్ / ఒక భాషను స్థానిక భాషగా చదివినట్లు సర్టిఫికెట్ ఫ్రూఫ్ సమర్పించాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులు కాదు.ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు.
వయోపరిమితి: 30.03.2025 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు తిరిగి వివాహం చేసుకోని భర్తల నుండి చట్టబద్ధంగా విడిపోయిన మహిళలు(జనరల్/ఈడబ్ల్యూఎస్- 35 సంవత్సరాలు, ఓబీసీ- 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 40 సంవత్సరాలు), 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన వ్యక్తులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
స్టైపెండ్: నెలకు రూ.9,000.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.03.2025.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.03.2025.
✦ దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 14.04.2025.