చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(పీజీఐఎంఈఆర్) వివిధ గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 206 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి ఐటీఐ, డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 206 


* గ్రూప్ ఎ, బి, సి పోస్టులు


ఖాళీలు: అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, ట్యూటర్ టెక్నీషియన్, రిసెర్చ్ అసోసియేట్, స్టోర్ కీపర్, జూనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ ఓటీ, రిసెప్షనిస్ట్, బాయిలర్‌ మ్యాన్, లోయర్ డివిజన్ క్లర్క్, CSR అసిస్టెంట్, మసల్చి/బేరర్, ఆఫీస్ అటెండెంట్, సెక్యూరిటీ గార్డు. 


విభాగాలు: బయోకెమిస్ట్రీ, స్పీచ్ థెరపీ మరియు ఆడియాలజీ, రేడియాలజీ, రేడియోథెరపీ, సైటోలజీ, హెమటాలజీ, నెఫ్రాలజీ, హిస్టోపాథాలజీ, ఇమ్యునోపాథాలజీ, మెడికల్ మైక్రోబయాలజీ, 


అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి ఐటీఐ, డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రూ.1500. ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు రూ.800. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎల్‌డీసీ పోస్టులకు స్కిల్ టెస్ట్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అదనంగా నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.06.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 13.07.2023.


Notification


Website


ALSO READ:


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో 73 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial