తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2022 షెడ్యూలును ఉస్మానియా విశ్వవిద్యాలయం డిసెంబరు 22న విడుదల చేసింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు సెట్ నిర్వహించలేదు. తాజాగా టీఎస్‌సెట్-2022 నిర్వహించనున్నారు.


వచ్చే ఏడాది మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా టీఎస్ సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


యూజీసీ మార్పుల‌కు అనుగుణంగా సెట్ నిర్వహ‌ణ‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొద‌టి పేప‌ర్‌లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు.. రెండో పేప‌రులో 100 ప్రశ్నల‌కు 200 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష సమయం 3 గంట‌లు.


Website 




Also Read:


అగ్రికల్చర్, హార్టికల్చర్ బీఎస్సీ ఫీజులు ఖరారు - ఏ కోర్సుకు ఎంతంటే?
సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీ కోర్సు ఫీజులను ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఖరారు చేసింది. బీఎస్సీ కోర్సులో చేరాలంటే ఇకపై మొదటి సంవత్సరం రూ.11 లక్షల ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మిగిలిన మూడేళ్లు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. అలాగే హార్టికల్చర్ బీఎస్సీ కోర్సుకైతే మొదటి ఏడాది రూ.6 లక్షలు, మిగిలిన మూడేళ్లపాటు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని తెలిపింది.


ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్ ర్యాంకర్లు డిసెంబర్ 28, 29 తేదీల్లో వర్సిటీలో జరిగే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. ఈడబ్ల్యుఎస్ కేటగిరీకి చెందిన విద్యార్థులు తప్ప.. మిగిలినవారంతా ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని స్పష్టంచేసింది. ఎంసెట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏజీ బీఎస్సీ కోర్సులో 154, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌లో 10, హార్టీకల్చర్ బీఎస్సీలో 40 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లన్నీ జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నందున వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రైవేటు కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరాలంటే ఇంతకన్నా ఎక్కువగా రుసుములు ఉన్నందున విద్యార్థులు వీటిలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్! ఈ సారికి 'ఇంటర్' వెయిటేజీ లేనట్లే?
తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ జనవరిలో విడుదలకానుంది. ఒకపక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను వెల్లడించడం, మరోవైపు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఎంసెట్‌ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. 
తెలంగాణ ఎంసెట్ 2023 పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..