రాంచీలోని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రీ(సీఐపీ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో ఆక్యుపేషన్ థెరపిస్ట్, లైబ్రరీ క్లర్క్, మెడికల్‌రికార్డ్ క్లర్క్, నీడిల్ వుమెన్, వార్డ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సెప్టెంబరు 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబర్ నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


 


వివరాలు..  


 


మొత్తం ఖాళీలు: 97


 


1) ఆక్యుపేషన్ థెరపిస్ట్: 01


 


2) లైబ్రరీ క్లర్క్: 01


 


3) మెడికల్‌రికార్డ్ క్లర్క్: 01


 


4) నీడిల్ వుమెన్: 01


 


5) వార్డ్ అటెండెంట్: 93


 


Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!


 


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి,12వ తరగతి, సైన్స్ లేదా కంప్యూటర్ సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


 


అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్‌లో తగినంత అనుభవం ఉండాలి.


 


వయోపరిమితి: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


 


ఎంపిక విధానం: ఫిజికల్అండ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్, మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.


 


Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!


 


పరీక్ష ఫీజు:  జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడి అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ''Central Institute of Psychiatry, Account No.:-26260200000205, IFSC - BARBOKANKEE'' పేరిట ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.   


 


జీతం:


* ఆక్యుపేషన్ థెరపిస్ట్: రూ.35400-రూ.112400


* లైబ్రరీ క్లర్క్: రూ.19900-రూ.63200


* మెడికల్‌రికార్డ్ క్లర్క్: రూ.19,900-రూ.63,200


* నీడిల్ వుమెన్: రూ.19,900-రూ.63,200


* వార్డ్ అటెండెంట్: రూ.18,000-రూ.56,900.


 


ముఖ్యమైన తేదీలు:


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2022.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.09.2022


 


Note: రాతపరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు, తదితర వివరాలను అక్టోబరు 22 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు ప్రింట్ తీసుకుని పరీక్ష రోజున తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది. హాల్‌టికెట్ లేనిదే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష కేంద్రలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, మొబైల్ ఫోన్, పేజర్, ఇతర ఉపకరణాలను అనుమతించరు. ఒకవేళ వెంట తెచ్చుకున్న పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశలో ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు నిరంతరం వెబ్‌సైట్ చూస్తుండటం ఉత్తమం.


 


Notification


 


Website


 


 


Also Read:


SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..  



Also Read:

ITBP Constable Notification: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...