OIL Recruitment: ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) వివిధ విభాగాల్లో గ్రేడ్ సి, గ్రేడ్ బి & గ్రేడ్ ఎ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజినీరీంగ్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ, డీఎన్‌బీ/ఎంఎస్, ఎండీ, డిప్లొమా, ICAI/ICMAI, కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 102
* గ్రేడ్ సి పోస్టులు
➥ సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్ (ఆర్థోపెడిక్స్): 01
వయోపరిమితి: 29.01.2024 నాటికి 40 సంవత్సరాలు.
అర్హత: డీఎన్‌బీ/ఎంఎస్(ఆర్థోపెడిక్స్).
➥ సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్ (రేడియాలజీ): 01
వయోపరిమితి: 29.01.2024 నాటికి 37 సంవత్సరాలు.
అర్హత: ఎండీ(రేడియో డయాగ్నోసిస్).
➥ సూపరింటెండింగ్ ఇంజినీర్(పర్యావరణం): 02
వయోపరిమితి: 29.01.2024 నాటికి 35-39 సంవత్సరాలు.
అర్హత: డిగ్రీ (ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్)
* గ్రేడ్ బి పోస్టులు
➥ సీనియర్ ఆఫీసర్ (కెమికల్): 02
వయోపరిమితి: 29.01.2024 నాటికి 29-32 సంవత్సరాలు.
అర్హత: పీజీ (కెమిస్ట్రీ).
➥ సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): 10
వయోపరిమితి: 29.01.2024 నాటికి 27-32 సంవత్సరాలు.
అర్హత: డిగ్రీ (ఇంజినీరీంగ్)
➥ సీనియర్ ఆఫీసర్ (ఫైర్ & సేఫ్టీ): 11
వయోపరిమితి: 29.01.2024 నాటికి 27-32 సంవత్సరాలు.
అర్హత: డిగ్రీ (సేఫ్టీ & ఫైర్).
➥ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ / సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్: 11
వయోపరిమితి: 29.01.2024 నాటికి 29-34 సంవత్సరాలు.
అర్హత: ICAI/ICMAI
➥ సీనియర్ ఆఫీసర్ (మెకానికల్): 41
వయోపరిమితి: 29.01.2024 నాటికి 27-32 సంవత్సరాలు.
అర్హత: డిగ్రీ (ఇంజినీరీంగ్).
➥ సీనియర్ ఆఫీసర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 03
వయోపరిమితి: 29.01.2024 నాటికి 27-30 సంవత్సరాలు.
అర్హత: డిగ్రీ (CS/ IT ఇంజినీరీంగ్).
➥ సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 06
వయోపరిమితి: 29.01.2024 నాటికి 27-30 సంవత్సరాలు.
అర్హత: డిగ్రీ (సంబంధిత ఇంజినీరీంగ్)
➥ సీనియర్ ఆఫీసర్ (పెట్రోలియం): 05
వయోపరిమితి: 29.01.2024 నాటికి 29-34 సంవత్సరాలు.
అర్హత: పీజీ(పెట్రోలియం ఇంజినీరీంగ్/ టెక్నాలజీ).
➥ సీనియర్ జియాలజిస్ట్: 03
వయోపరిమితి: 29.01.2024 నాటికి 32 సంవత్సరాలు.
అర్హత: పీజీ(జియాలజిస్ట్).
➥ సీనియర్ ఆఫీసర్ (HR): 03
వయోపరిమితి: 29.01.2024 నాటికి 32 సంవత్సరాలు.
అర్హత: ఎంబీఏ(పర్సనల్ మేనేజ్‌మెంట్/HR/HRD/HRM)
➥ సీనియర్ ఆఫీసర్(HSE)*: 02
వయోపరిమితి: 29.01.2024 నాటికి 30-32 సంవత్సరాలు.
అర్హత: డిగ్రీ (సంబంధిత ఇంజినీరీంగ్)
* గ్రేడ్ ఎ పోస్టులు
➥ కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ: 01
వయోపరిమితి: 29.01.2024 నాటికి 40-45 సంవత్సరాలు.
అర్హత: డిప్లొమా/డిగ్రీ (సంబంధిత డిసిప్లిన్)
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్/ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతనం: గ్రేడ్- సి పోస్టులకు రూ.80,000-2,20,000, గ్రేడ్- బి పోస్టులకు రూ.60000-180000, గ్రేడ్- ఎ పోస్టులకు రూ.50000-160000
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 29.01.2024
ALSO READ:
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 1646 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
జైపూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..