NTRO Recruitment 2024: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్ఓ) సైంటిస్ట్ 'B' ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 74


* సైంటిస్ట్ 'B' పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


⏩ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్: 35 


అర్హత: సంబంధిత విభాగాల్లో  డిగ్రీ(ఇంజినీరింగ్)/ పీజీ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ జ్ఞానం ఉండాలి.


⏩ కంప్యూటర్ సైన్స్: 33


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి డిగ్రీ(ఇంజినీరింగ్)/ పీజీ (మ్యాథమెటిక్స్) ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ జ్ఞానం ఉండాలి.


⏩ జియో-ఇన్ఫర్మేటిక్స్ మరియు రిమోట్ సెన్సింగ్: 06


అర్హత: సంబంధిత విభాగాల్లో  డిగ్రీ(ఇంజినీరింగ్)/ పీజీ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ జ్ఞానం ఉండాలి.


వయోపరిమితి: 19.01.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  


ఎంపిక విధానం: రాత పరీక్ష(సీబీటీ), గేట్ స్కోర్, వెయిటేజీ, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


పరీక్షా విధానం: మొత్తం 100 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులు కెటాయించారు. పరీక్ష సమయం: 120 నిమిషాలు. ఇంటర్వ్యూకి 50 మార్కులు. 


పరీక్ష కేంద్రాలు: గౌహతి(అస్సాం), న్యూ ఢిల్లీ(ఢిల్లీ), బెంగళూరు(కర్ణాటక), ముంబై(మహారాష్ట్ర), లక్నో(ఉత్తరప్రదేశ్), కోల్కతా (వెస్ట్ బెంగాల్).


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2023


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.01.2024 


Notification


Website


ALSO READ:


ప్రకాశం జిల్లాలో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
ఒంగోలులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలోని డా. వైఎస్ఆర్ నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ బీఫార్మసీ/ ఫార్మా-డి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


విశాఖపట్నం వైద్యారోగ్య విభాగంలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు
విశాఖపట్నంలోని వైద్యారోగ్య సేవల ప్రాంతీయ కార్యాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్/ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు లేదా సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 12లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...