NTPC Recruitment of Engineering Executive Trainees through GATE-2024: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 475 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.  గేట్-2024  స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్ట్, తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు. 


వివరాలు..  


ఖాళీల సంఖ్య: 475


* ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


⏩ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 135 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్- 85 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 12 పోస్టులు, ఓబీసీ- 08 పోస్టులు, ఎస్సీ- 22 పోస్టులు, ఎస్టీ- 08 పోస్టులు. 


⏩ మెకానికల్ ఇంజినీరింగ్: 180 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్- 96 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 13 పోస్టులు, ఓబీసీ- 22 పోస్టులు, ఎస్సీ- 34 పోస్టులు, ఎస్టీ- 15 పోస్టులు. 


⏩ ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 85 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: యూఆర్- 35 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 08 పోస్టులు, ఓబీసీ- 27 పోస్టులు, ఎస్సీ- 15 పోస్టులు. 


⏩ సివిల్ ఇంజినీరింగ్: 50 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: యూఆర్- 25 పోస్టులు, ఓబీసీ- 03 పోస్టులు, ఎస్సీ- 16 పోస్టులు, ఎస్టీ- 06 పోస్టులు. 


⏩ మైనింగ్ ఇంజినీరింగ్: 25 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: యూఆర్- 13 పోస్టులు, ఓబీసీ- 03 పోస్టులు, ఎస్సీ- 05 పోస్టులు, ఎస్టీ- 04 పోస్టులు. 


అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


వయోపరిమితి: 11.02.2025 నాటికి 27 సంవత్సరాలలోపు ఉండాలి.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ,ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, గేట్-2024 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్ట్, తదితరాల ఆధారంగా.


జీతం: నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు. 


దరఖాస్తు చేయడం ఎలా..


➥ అభ్యర్థులు NTPC EET-2024 కోసం careers.ntpc.co.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి లేదా www.ntpc.co.inలోని కెరీర్స్ విభాగాన్ని సందర్శించి వారి గేట్-2024 రిజిస్ట్రేషన్ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలి.


➥ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అవసరమైన అన్ని పత్రాలను (#9 వద్ద క్రింద జాబితా చేయబడినవి) అప్‌లోడ్ చేయాలి. గేట్-2024 రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.


➥ సూచనలను జాగ్రత్తగా చదవిన తర్వాత  గేట్-2024 రిజిస్ట్రేషన్ నంబర్‌తో సహా అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. పిదప సిస్టమ్ ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ నంబరు ఇస్తుంది. తదనంతరం అభ్యర్థులు అప్లికేషన్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి అండ్ దరఖాస్తు చేసుకొన్న తర్వాత సిస్టమ్ ద్వారా జనరేట్ చేయబడిన అప్లికేషన్ స్లిప్ యొక్క ప్రింట్ అవుట్‌ను జాగ్రత్త చేసుకోవాలి.


➥ అభ్యర్థులు తమ గేట్-2024 స్కోర్ కార్డ్‌లో పేర్కొన్న రిజిస్ట్రేషన్ నంబర్ సరిగ్గా పూరించబడిందని నిర్ధారించుకోవాలి. గేట్ స్కోర్ కార్డ్‌లో కనిపించే విధంగా పేరును కూడా పూరించాలి. దరఖాస్తు విజయవంతంగా సమర్పించిన తర్వాత అభ్యర్థి నమోదు చేసిన వివరాలలో ఏదైనా మార్చాలంటే దానికి సంబంధించి ఎటువంటి అభ్యర్థనను స్వీకరించబడదు.


అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్..


➥ 1 నుంచి 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ లేదా మార్క్‌షీట్(పేరు/పుట్టిన తేదీ ధృవీకరణకు)


➥ పాన్ కార్డ్ & ఆధార్ కార్డ్.


➥ గేట్ 2024 స్కోర్ కార్డ్ ఒరిజినల్ స్కాన్ చేసిన కాపీ.


➥ ఇంజినీరింగ్ డిగ్రీ (ఫైనల్/తాత్కాలిక సర్టిఫికేట్).


➥ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం లేదా కన్సాలిడేటెడ్ మార్క్‌షీట్/ట్రాన్స్‌క్రిప్ట్ స్పష్టంగా మొత్తం ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ అన్ని సెమిస్టర్‌లలో మొత్తం పర్సంటేజ్ మార్కుల సరాసరి.


➥ చెల్లుబాటు అయ్యే కాస్ట్/కేటగిరీ సర్టిఫికేట్.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.01.2025


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.02.2025


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..