NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ఎక్స్‌సర్వీస్‌మెన్ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 3వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* డిప్యూటీ మేనేజర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 110 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్): 20
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలికేషన్ అనుభవం (శిక్షణ/ట్రైనీ కాలంతో సహా) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ డిప్యూటీ మేనేజర్(మెకానికల్ ఎరేక్షన్): 50
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ (మెకానికల్/ప్రొడక్షన్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలికేషన్ అనుభవం (శిక్షణ/ట్రైనీ కాలంతో సహా) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ డిప్యూటీ మేనేజర్(సి అండ్ ఐ ఎరెక్షన్): 10
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/కంట్రోల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలికేషన్ అనుభవం (శిక్షణ/ట్రైనీ కాలంతో సహా) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ డిప్యూటీ మేనేజర్(సివిల్ కన్‌స్ట్రక్షన్): 30
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ (సివిల్/కన్‌స్ట్రక్షన్) ఉత్తీర్ణులై ఉండాలి
అనుభవం: కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలికేషన్ అనుభవం (శిక్షణ/ట్రైనీ కాలంతో సహా) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ఎక్స్‌సర్వీస్‌మెన్ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతనం: నెలకు రూ.70,000 - రూ.2,00,000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.02.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 08.03.2024.