NPCIL Recruitment: ముంబయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 500 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 400 పోస్టులు.


కేటగిరీ వారీగా ఖాళీలు: యూఆర్- 159, ఈడబ్ల్యూఎస్- 39, ఎస్సీ-61, ఎస్టీ-32, ఓబీసీ(ఎస్‌సీఎల్)- 109. 


* ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


1. మెకానికల్: 150 పోస్టులు


2. కెమికల్: 73 పోస్టులు


3. ఎలక్ట్రికల్: 69 పోస్టులు


4. ఎలక్ట్రానిక్స్: 29 పోస్టులు


5. ఇన్‌స్ట్రుమెంటేషన్: 19 పోస్టులు


6. సివిల్: 60 పోస్టులు


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీర్ విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30.04.2024 నాటికి జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 29 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు మించకూడదు. పీడబ్ల్యూబీడీ(జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 39 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 41 సంవత్సరాలు మించకూడదు). నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: జనరల్,ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గేట్ 2022,2023, 2024 స్కోరు ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.56,100.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్‌లో దరఖాస్తు &ఫీజు చెల్లింపునకు ప్రారంభ తేదీ : 10.04.2023


ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ : 30.04.2023


Notification


Online Application


Website


ALSO READ:


NITD: నిట్‌ దుర్గాపూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా
NITD Recruitment: పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్‌ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎపుడంటే
AAI Recruitment 2024: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌- 2024 స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్‌ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..