న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ), నార్తర్న్‌ రైల్వే వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 323 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్ఎల్‌సీ, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 323


⏩ అసిస్టెంట్ లోకో పైలట్: 169


⏩ ట్రైన్ మేనేజర్/గూడ్స్ గార్డ్: 46


⏩ టెక్నీషియన్-III/డిజిల్/మెకానిక్.: 02


⏩ టెక్నీషియన్-III/సీ&డబ్ల్యూ: 22 


⏩ టెక్నీషియన్-III/టీఎల్: 02


⏩ టెక్నీషియన్-III/సిగ్నల్: 13


⏩ టెక్నీషియన్-III/టీఈఎల్ఈ: 05


⏩ టెక్నీషియన్-III/వెల్డర్/ఇంజినీరింగ్: 01


⏩ టెక్నీషియన్-III/ఈఎంయూ: 05


⏩ టెక్నీషియన్-III/బ్లాక్‌స్మిత్/ఇంజినీరింగ్: 07


⏩ టెక్నీషియన్-III/టీఆర్‌డీ: 15


⏩ టెక్నీషియన్-III/టీఆర్ఎస్: 03


⏩ టెక్నీషియన్-III/ఏసీ: 02


⏩ టెక్నీషియన్-III/ఎలక్ట్రానిక్స్/ఫిట్టర్: 01


⏩ జూనియర్ ఇంజినీర్/పి.వే: 12     


⏩ జూనియర్ ఇంజినీర్/వర్క్స్: 10


⏩ జూనియర్ ఇంజినీర్/సీ&డబ్ల్యూ/మెకానిక్: 03


⏩ జూనియర్ ఇంజినీర్-II/ఎలక్ట్రికల్‌-G: 01


⏩ జూనియర్ ఇంజినీర్/ఎలక్ట్రికల్ టీఆర్ఎస్: 02


⏩ జూనియర్ ఇంజినీర్/డిజిల్/ఎలక్ట్రికల్‌: 01


⏩ జూనియర్ ఇంజినీర్/టీఆర్‌డీ: 01 


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్ఎల్‌సీ, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 18-42 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 28.08.2023.


Notification


Website


ALSO READ:


టీఎస్ టెట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే అభ్యర్థులూ అర్హులే. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో 70 గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్‌పీఎల్) గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 55శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా,డిగ్రీ 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌లో 105 ట్రాలీ రిట్రీవర్ పోస్టులు
చెన్నైలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏఏఐ సీఎల్‌ఏఎస్‌) ట్రాలీ రిట్రీవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 105 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 02వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్‌ ఎఫిషియన్సీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..