NIT Manipur Recruitment: మణిపుర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 48 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10+2, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 05వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 48


అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01


లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01


టెక్నికల్ అసిస్టెంట్: 15


జూనియర్ ఇంజనీర్: 01


సూపరింటెండెంట్: 04


జూనియర్ అసిస్టెంట్: 03


సాంకేతిక నిపుణుడు: 15


ఆఫీస్ అటెండెంట్/ల్యాబ్. అటెండెంట్: 08


అర్హత: పోస్టును అనుసరించి 10+2, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 27-35 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.500.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


చిరునామా: The Registrar, National Institute of Technology Manipur, 
                     Langol, Imphal West-795004, Manipur, India.


ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు చివరి తేది: 05.09.2023.


Notification


Website


ALSO READ:


ఎన్‌ఎస్‌యూటీ న్యూఢిల్లీలో 322 ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ప్రొఫెసర్, అసిస్ట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు హార్డుకాపీలను పంపించాలి. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌లో 875 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
WCL Nagpur Recruitment: నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌ లిమిటెడ్ డబ్ల్యూసీఎల్‌కి చెందిన వివిధ ప్రాంతాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 875 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..