కోల్కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైపర్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 08
* టీచింగ్ పోస్టులు
1. ప్రొఫెసర్: 02 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్: 01 పోస్టు
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 02 పోస్టులు
* నాన్ - టీచింగ్ పోస్టులు
1. గెస్ట్ హౌస్, హాస్టల్ సూపర్‌వైజర్: 01 పోస్టు
2. సైంటిస్ట్/ టెక్నికల్ సూపర్‌వైజర్ గ్రేడ్-2: 01 పోస్టు
3. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టుని అనుసరించి 35-50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: పోస్టుని అనుసరించి టీచింగ్, నాన్ టీచింగ్ రెండింటికీ రూ.1000, నాన్ టీచింగ్ పోస్టులకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.05.2023.
Also Read:
భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 4,374 ఉద్యోగాలు, అర్హతలివే!
ముంబయిలోని భారత అణు శక్తి విభాగం ఆధ్వర్యంలోని 'భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్' వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 24 నుంచి మే 22 లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న వెబ్‌నోట్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల చేశారు. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..
యూపీఎస్సీ సీఎంఎస్-2023 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 1261 పోస్టుల భర్తీ!
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 19న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 1261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 19 నుంచి మే 9న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..