నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలాజికల్స్(ఎన్ఐబీ) ఆధ్వర్యంలోని రాజధాని ఎంటర్ ప్రైజెస్ ఒప్పంద ప్రాతిపదికన బయాలజిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌, ఎంపార్మసీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 31వ తేదీ వరకు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 65


* బెంచ్‌ బయాలజిస్ట్‌ పోస్టులు.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌, ఎంపార్మసీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఈమెయిల్:  rajdhanienterprises2007@gmail.com


ఎంపిక ప్రక్రియ:  ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీత భత్యాలు: నెలకు రూ.40000 చెల్లిస్తారు.


దరఖాస్తుకు చివరి తేది: 31.07.2023.


Notification


Website



ALSO READ:


1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
ముంబయిలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఐఏసీఎల్) దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్‌ శాఖల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకి ఆగస్టు1వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌‌లో 55 గ్రాడ్యుయేట్‌& టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులు
ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌‌ గ్రాడ్యుయేట్‌& టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 55 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



Join Us on Telegram: https://t.me/abpdesamofficial