నవోదయ విద్యాలయ సమితిలో 2200 పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలు విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబరు 25 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పూర్తి షెడ్యూల్ ఇలా..
🔰 టీజీటీ రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 29న రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్ష జరుగుతుంది.
🔰 ఇతర టీచింగ్ పోస్టులకు నవంబర్ 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
🔰 స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022-23 పోస్టులకు నవంబర్ 28 నుంచి 30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
🔰 లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ ఎగ్జామినేషన్ 2022-23 (పీజీటీ) పోస్టులకు నవంబర్ 28 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
రాత పరీక్ష విధానం..
మొత్తం 150 ప్రశ్నలకుగానే 150 మార్కులకు 3 గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆయా తేదీల్లో పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా తమతో పాటు అడ్మిట్ కార్డుతోపాటు, ఏదైనా గుర్తింపు కార్డును తీసుకు వెళ్లాలి.
అభ్యర్థుల పరీక్ష నగరం, పరీక్ష తేది వివరాల కోసం క్లిక్ చేయండి..
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 2200
పోస్టుల వివరాలు:
- ప్రిన్సిపల్ పోస్టులు: 12
- పీజీటీ పోస్టులు: 397
- టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులు: 683
- టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్) పోస్టులు: 343
- మ్యూజిక్ టీచర్ పోస్టులు: 33
- ఆర్ట్ టీచర్ పోస్టులు: 43
- పీఈటీ (పురుష) పోస్టులు: 21
- పీఈటీ (స్త్రీ) పోస్టులు: 31
- లైబ్రేరియన్ పోస్టులు: 53
- ఎన్ఈ రీజియన్ పోస్టులు: 584
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు:
- ప్రిన్సిపల్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
- టీజీటీ పోస్టులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
- ఇతర కేటగిరీ పోస్టులకు గ్రాడ్యుయేషన్, డిప్లొమా (లైబ్రరీ సైన్స్), బీపీఈడీ, డిప్లొమా (ఫైన్ ఆర్ట్స్), బ్యాచిలర్స్ డిగ్రీ (మ్యూజిక్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- ప్రిన్సిపల్ పోస్టులకు: రూ.2,000
- పీజీటీ పోస్టులకు: రూ.1,800
- టీజీటీ, ఇతర కేటగిరీ పోస్టులకు: రూ.1,500
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 2, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ECIL Walkin: ఈసీఐఎల్‌లో 190 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 26,28,29 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, వాక్‌ఇన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..