IAS Trasnfers: తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను బదిలీ చేసి, ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్‌ను నియమించింది. నికోలస్ గతంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉంది.  ఐఎఫ్‌ఎస్ అధికారి వీఎస్ ఎన్వీ ప్రసాద్ పౌరసరఫరాల సంచాలకునిగా నియమితులయ్యారు. రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్‌లు, ఒక ఐఎఫ్‌ఎస్‌ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 


9 మంది బదిలీలు అధికారులు వీరే..


➥ వివాద అధికారిగా విమర్శలు ఎదుర్కొంటున్న సమాచారశాఖ కమిషనర్‌ కె.అశోక్‌రెడ్డికి ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో ఎం.హన్మంతరావును నియమించింది. అశోక్‌రెడ్డికి హార్టికల్చర్‌ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించింది. 


➥ జూపార్క్‌ డైరెక్టర్‌ వీఎస్‌ఎన్వీ ప్రసాద్‌కు సివిల్‌ సప్లయ్‌ డైరెక్టర్‌గా నియమించింది.


➥ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌‌ బి.బాలమాయదేవిని బీసీ వెల్ఫేర్‌ కమిషనర్‌గా నియమించింది.


➥ టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది.


➥ వ్యవసాయ కమిషనర్ బి.గోపీని ఫిషరీస్‌ కమిషనర్‌‌గా నియమించింది. 


➥ క్రైస్తవ మైనారిటీ సంస్థ ఎండీ ఎ.నిర్మలకాంతి వెస్లీని స్త్రీ శిశుసంక్షేమశాఖ కమిషనర్‌గా నియమించింది.


➥ పంచాయతీరాజ్ కమిషనర్ ఎం. హనుమంతరావును సమాచారా, పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. 


➥ ఇక ఇటీవలే ఐఏఎస్‌గా పదోన్నతులు పొంది వెయిటింగ్‌లో ఉన్న కె.సీతాలక్ష్మి, జి.ఫణీంద్రరెడ్డిలకు పోస్టింగులు ఇచ్చింది. సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా సీతాలక్ష్మిని, ఫణీంద్రరెడ్డిని చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.