NITK Recruitment: కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 77
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II
విభాగాల వారీగా ఖాళీలు..
➥ సివిల్ ఇంజినీరింగ్- 07 పోస్టులు
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 05 పోస్టులు
➥ మెకానికల్ ఇంజినీరింగ్- 05 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 09 పోస్టులు
➥ కంప్యూటర్ ఇంజినీరింగ్- 10 పోస్టులు
➥ ఫిజిక్స్- 01 పోస్టు
➥ కెమిస్ట్రీ- 02 పోస్టులు
➥ మ్యాథమెటిక్స్- 04 పోస్టులు
➥ హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్- 02 పోస్టులు
➥ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్- 03 పోస్టులు
➥ కంప్యూటర్ అప్లికేషన్స్- 03 పోస్టులు
➥ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్- 02 పోస్టులు
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I
విభాగాల వారీగా ఖాళీలు..
➥ సివిల్ ఇంజినీరింగ్- 03 పోస్టులు
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 02 పోస్టులు
➥ మెకానికల్ ఇంజినీరింగ్- 02 పోస్టులు
➥ ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 01 పోస్టు
➥ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 04 పోస్టులు
➥ కంప్యూటర్ ఇంజినీరింగ్- 01 పోస్టు
⏩ అసోసియేట్ ప్రొఫెసర్
విభాగాల వారీగా ఖాళీలు..
➥ సివిల్ ఇంజినీరింగ్- 03 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 01 పోస్టు
➥ కంప్యూటర్ ఇంజినీరింగ్- 03 పోస్టులు
➥ ఫిజిక్స్- 01 పోస్టు
➥ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్- 01 పోస్టు
➥ కంప్యూటర్ అప్లికేషన్స్- 01 పోస్టు
➥ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్- 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.04.2024.
🔰 దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 30.04.2024.
ALSO READ:
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
కోల్ ఇండియా ఆధ్వర్యంలోని నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 34 సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు రూ.70,000-2,00,000, మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ. 60,000 - 1,80,000 జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..