National Institute of Rural Development:

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా ఫార్మసిస్ట్, యంగ్ ఫ్రొఫెషనల్, లేడీ మెడికల్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, యునిసెఫ్ సీఆర్‌యూ-SBCC కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

వివరాలు..

➥ ఫార్మసిస్ట్ (కాంట్రాక్ట్): 01 పోస్టు

కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఫార్మసీ).

అనుభవం: సంబంధిత విభాగంలో 2 - 3 సంవత్సరాలు. 

వయోపరిమితి: 45 సంవత్సరాలకు మించకూడదు.

వేతనం: నెలకు రూ.30,000.

వాక్ఇన్ తేదీ: 07.11.2023.

సమయం: ఉదయం 10.00 గంటల నుంచి.

వాక్ఇన్ వేదిక: Vikas Auditorium, NIRDPR, Rajendranagar, Hyderabad.

➥ యంగ్‌ ప్రొఫెషనల్‌: 04 పోస్టులు

అర్హత: పీజీ డిగ్రీ. ఎంబీఏ(హెచ్‌ఆర్‌) చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు రూ.32,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 12.11.2023

➥ లేడీ మెడికల్ ఆఫీసర్‌

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏదైనా గవర్నమెంటు హాస్పిటల్‌లో పని చేసిన అనుభవం ఉండాలి.

అనుభవం: 4 - 5 సంవత్సరాలు.

వేతనం: నెలకు రూ.75,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 15.11.2023.

➥ యునిసెఫ్ సీఆర్‌యూ-SBCC కోఆర్డినేటర్: 01 పోస్టు

విభాగం: ట్రైనింగ్ & నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ 

అర్హత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పబ్లిక్ సెక్టార్/సెమీ గవర్నరమెంట్/స్టాచ్యుటరీ అటానమస్ లేదా రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో

ఆఫీసర్ స్థాయిలో పనిచేస్తూ ఉండాలి. వయోపరిమితి: 56 సంవత్సరాలలోపు ఉండాలి.

వేతనం: రూ.9,300 - రూ.34.800.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 04.12.2023

➥ సెక్షన్ ఆఫీసర్ (డిప్యూటేషన్): 02 పోస్టులు

అర్హత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పబ్లిక్ సెక్టార్/సెమీ గవర్నరమెంట్/స్టాచ్యుటరీ అటానమస్ లేదా రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో

ఆఫీసర్ స్థాయిలో పనిచేస్తూ ఉండాలి. వయోపరిమితి: 56 సంవత్సరాలలోపు ఉండాలి.

వేతనం: రూ.9,300 - రూ.34.800.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 04.12.2023

Notifications & Online Application

ALSO READ:

ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో 309 అప్రెంటిస్ పోస్టులు, ఐటీఐ అర్హత చాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), కర్నూలు పరిధిలో... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 309 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్‌ 15లోగా ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి, అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఐటీఐలలో చదివినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్ 418 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 801  పోస్టులు, ట్రిపుల్ ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...