నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్(ఎన్ఐబీ) న్యూఢిల్లీలోని రాజధాని ఎంటర్‌ప్రైజెస్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 24లోగా తమ రెజ్యూమ్‌ను సంబంధిత ఈమెయిల్ ఐడీకి పంపాల్సి ఉంటుంది.


వివరాలు..


మొత్తం పోస్టులు: 59


1) టెక్నికల్‌ అసోసియేట్: 08 పోస్టులు


విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, ఐటీ డివిజన్‌.


అర్హత: ఏదైనా డిగ్రీ. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి.


అనుభవం: ప్రభుత్వ లేదా అటానమస్ విభాగంలోని ఏదైనా సైంటిఫిక్ ఆర్గనైజేషన్‌లో 5-10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 65 సంవత్సరాలలోపు ఉండాలి.


2) డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 06 పోస్టులు


విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, ఐటీ డివిజన్‌.


అర్హతలు: డిగ్రీతోపాటు డిప్లొమా (కంప్యూటర్/సెక్రటేరియల్ ప్రాక్టీస్) ఉండాలి. ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు, 30 హిందీ పదాలు  టైప్ చేయగలగాలి.


అనుభవం: ప్రభుత్వ లేదా అటానమస్ విభాగంలోని ఏదైనా సైంటిఫిక్ ఆర్గనైజేషన్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.


3) ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: 45 పోస్టులు


అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. 


పని అనుభవం: ప్రభుత్వ లేదా అటానమస్ విభాగంలోని ఏదైనా సైంటిఫిక్ ఆర్గనైజేషన్‌లో  ఏడాది పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా రెజ్యూమ్ పంపాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తుకు చివరితేది: 24.04.2023


Email: rajdhanienterprises2007@gmail.com 


Email: rajdhanienterprises338@gmail.com


Notification


Website 


                                         


Also Read:


అణుశక్తి విభాగంలో 65 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబయితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్‌ యూనిట్లలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


CIPET: సీపెట్‌లో 38 సూపర్‌వైజరీ & నాన్-సూపర్‌వైజరీ పోస్టులు
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ దేశవ్యాప్తంగా సీపెట్‌ కేంద్రాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 38 సూపర్‌వైజరీ, నాన్-సూపర్‌వైజరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 29 వరకు ఆఫ్‌లైన్ విధానంలో సంబంధిత చిరునామాకు దరఖాస్తులు పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...