NALCO Recruitment: భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్‌, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 10


* స్పెషలిస్ట్‌ పోస్టులు


➥ స్పెషలిస్ట్‌/ E02  గ్రేడ్: 04 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01, ఈడబ్ల్యూఎస్- 01, ఎస్సీ-01.


విభాగాలు: ఆర్థోపెడిక్‌- 01, పీడియాట్రిక్- 02, రేడియోలజీ- 01.


అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్‌, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.


పే స్కేల్: రూ.70,000-రూ.2,00,000.


➥ స్పెషలిస్ట్‌/ E03 గ్రేడ్‌: 06 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: యూఆర్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 02, ఈడబ్ల్యూఎస్- 01.


విభాగాలు: ఆర్థోపెడిక్‌- 01, పీడియాట్రిక్- 02, రేడియోలజీ- 01, మెడిసిన్‌- 01, ఆఫ్తల్మాలజీ- 01.


అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్‌, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 38 సంవత్సరాలు మించకూడదు.


పే స్కేల్: రూ.80,000-రూ.2,20,000. 


దరఖాస్తు ఫీజు: ఫీజు లేదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.01.2024.


Notification


Website


ALSO READ:


ఏపీ ట్రిపుల్‌ఐటీలో 194 టీచింగ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
AP RGUKT Teaching Faculties Recruitment 2024: ఆంధ్రప్రదేశ్‌‌లోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో టీచింగ్ పోస్టుల (Teaching Faculties) భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిద్వారా నూజివీడు (ఏలూరు జిల్లా), ఆర్కే వ్యాలీ (కడప జిల్లా), ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 194 లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: recruitments@rgukt.in ద్వారా సంప్రదింవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీయూకేటీ క్యాంపస్‌లలో ప్రతి సంవత్సరం ఒక్కో క్యాంపస్‌లో 1100 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలు పొందినవారికి 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ కోర్సు (PUC), 4 సంవత్సరాల B.Tech కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 1646 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
జైపూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..