ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 07


➥ ప్రాజెక్ట్ మేనేజర్: 01


➥ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్: 01


➥ ప్రొక్యూర్‌మెంట్ ఎక్స్‌పర్ట్: 01


➥ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్: 01


➥ ప్రాజెక్ట్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్: 02


➥ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 01


అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత.


వయోపరివితి: 50-65 ఏళ్లు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.80000-రూ.1లక్ష చెల్లిస్తారు.


దరఖాస్తు చివరితేది: 06.04.2023.


చిరునామా: 
The Secretary, Mumbai Port Authority, 
General Administration Department, 
Port House, 2nd Floor, Shoorji Vallabhdas Marg, 
Ballard Estate, Mumbai – 400001.


Notification & Application


Website



Also Read:


HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 ఖాళీలు, వివరాలు ఇలా!
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్ఎల్) వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో పర్మనెంట్ నియామకాల కింద మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను; తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 6 వరకు పర్మనెంట్ పోస్టులకు, ఏప్రిల్ 16 వరకు ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గెయిల్‌ గ్యాస్‌ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...