MDSL Posts: ముంబయిలోని మాజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో డిప్లొమా/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 200
* డిప్లొమా/ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
⏩ డిప్లొమా అప్రెంటిస్: 30
➥ సివిల్ ఇంజినీరింగ్: 05
➥ కంప్యూటర్ ఇంజినీరింగ్: 05
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 10
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 10
అర్హత: స్టేట్ కౌన్సిల్ లేదా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2024 నాటికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలకు రూ.8000.
⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 170
➥ సివిల్ ఇంజినీరింగ్: 10
➥ కంప్యూటర్ ఇంజినీరింగ్: 05
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 25
➥ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 10
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 60
➥ షిప్‌బిల్డింగ్ టెక్నాలజీ/ ఇంజినీరింగ్/ నేవల్ ఆర్కిటెక్చర్: 10
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2024 నాటికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలకు రూ.9000.
⏩ జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్: 50
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బీకాం, బీసీఏ, బీబీఏ, డిగ్రీ (సోషల్ వర్క్/ఈవెంట్‌మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2024 నాటికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➤ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.01.2024.
➤ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 22.01.2024.
➤ ఇంటర్వ్యూలు ప్రారంభం: 30.01.2024.
ALSO READ:
గుంటూరు జీజీహెచ్‌లో 94 పారామెడికల్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
గుంటూరులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గుంటూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 7వ తరగతి, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 ACIO పోస్టులు, ఎంపికైతే రూ.1.42 లక్షల వరకు జీతం
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ, హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంఎస్సీ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు (Educational Qualification for IB Jobs). ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గేట్ స్కోరు (Gate Score), ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.