IBPS Exam at Vijayawada | విజయవాడలో జరిగిన ఐబీపీఎస్ (IBPS) నియామక పరీక్ష కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. పరీక్ష రాస్తున్న ఒక అభ్యర్థి హైటెక్ పద్ధతిలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రహస్యంగా అమర్చిన కెమెరా, రిమోట్ పరికరాల సహాయంతో సదరు అభ్యర్థి క్వశ్చన్స్ను బయటకు చేరవేసే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐబీపీఎస్ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన అభ్యర్థిని తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు ఇన్విజిలేటర్లు గుర్తించారు. ఈ పరిణామంతో ఆశ్చర్యపోయిన పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్, వెంటనే కో-ఆర్డినేటర్తో కలిసి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్ సిబ్బంది అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
