NPCIL Stipendiary Trainee Recruitment: రాజస్థాన్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 279 స్టైపెండరీ ట్రైనీ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్ 11లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత నెలకు రూ.32,550 జీతంగా చెల్లిస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 279.
1) స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-II (ఆపరేటర్): 153 పోస్టులు
2) స్టైపెండరీ కేటగిరీ-II (ట్రైనీ మెయింటైనర్): 126 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్-28, ఫిట్టర్-54, ఎలక్ట్రానిక్స్-14, ఇన్‌స్ట్రుమెంటేషన్-26, మెషినిస్ట్/టర్నర్-02, వెల్డర్-02.
అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి(సైన్స్ సబ్జెక్టుల్లో), సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 11.09.2024 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; 1984 అల్లర్ల బాధిత కుటుంబీకులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-60 మార్కులు, సైన్స్ 20 ప్రశ్నలు-60 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 10 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి ఒకమార్కు కోత విధిస్తారు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ కేటగిరీకి 40 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ-దివ్యాంగులు-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.
అడ్వాన్స్‌డ్ టెస్ట్ విధానం: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో అడ్వాన్స్‌డ్ టెస్ట్ నిర్వహిస్తారు. 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. ప్రతి పరీక్ష సమయం 2 గంటలు. ఆపరేటర్ పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. మెయింటెయినర్ పోస్టులకు అభ్యర్థికి సంబంధించిన విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి ఒకమార్కు కోత విధిస్తారు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ కేటగిరీకి 30 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ-దివ్యాంగులు-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 20 శాతంగా నిర్ణయించారు.
జీతం: ఎంపికైనవారికి స్టైపెండ్ కింద మొదటి సంవత్సరం నెలకు రూ.20,000; రెండో సంవత్సరం నెలకు రూ.22,000 ఇస్తారు. ఈ సమయంలో బుక్ అలవెన్స్ కింద అదనంగా ఒకేసారి రూ.3000 ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి టెక్నీషియన్-బి హోదాలో నెలకు రూ.32,550 జీతంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విధిగా సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది కనిష్టంగా 2 సంవత్సరాల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఉంటుంది. బాండ్ ఉల్లంఘించిన సందర్భంలో రూ.5,07,000 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మొత్తం స్టైపెండ్ ప్లస్ బుక్ అలవెన్స్‌కు సమానంగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.08.2024.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.09.2024.