JNPA Recruitment: ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 05 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 28 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. షార్ట్‌లిస్టెడ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 05


⏩ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు ఇంగ్లీషు రాయటం, చదవటం,  కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాంతీయ భాషలు మరాఠీ మరియు హిందీపై అవగాహన ఉండాలి. అన్ని ఫార్మాట్ కంటెంట్‌ను రాయడంలో ప్రావీణ్యం (ప్రెస్ రిలీజ్, సోషల్ మీడియా కాపీలు, ఆథర్డ్ ఆర్టికల్స్ మొదలైనవి). పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


⏩ హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి హ్యూమన్ రిసోర్సెస్/పర్సనల్ మేనేజ్‌మెంట్/లేబర్ లాస్‌లో 2-సంవత్సరాల పూర్తి సమయం పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


⏩ హిందీ టైపిస్ట్ కమ్ ట్రాన్స్‌లేటర్: 02 పోస్టులు


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలో హిందీ/ఇంగ్లిష్ మీడియంలో ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. టైపింగ్ వేగం నిమిషానికి 25 పదాలు మరియు అంతకంటే ఎక్కువ
హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ తప్పనిసరిగా ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లీష్‌కి, ఇంగ్లీష్‌ నుంచి హిందీకి ట్రాన్స్‌లేషన్ చేసిన అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టెడ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.


జీతం: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండ్ హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.50000. హిందీ టైపిస్ట్ కమ్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ.25000.


వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు..
➥ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 28.05.2024.
➥ హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్: 29.05.2024.
➥ హిందీ టైపిస్ట్ కమ్ ట్రాన్స్‌లేటర్: 30.05.2024.


వేదిక: Jawaharlal Nehru Port Authority, Mumbai.


Notification


Website



ALSO READ:


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 54 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైనవారికి భారీగా జీతం!
India Post Payments Bank Limited Recruitment: న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.  ఎంపికైనవారికి ఢిల్లీ, ముంబయి, చెన్నైలలో పోస్టింగ్ ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..