పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ - ITBI) గుడ్‌న్యూస్ అందించింది. ఐటీబీపీలో 65 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పదో తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణ జూలై 5న ప్రారంభం కాగా, సెప్టెంబర్ 2వ తేదీతో ముగియనుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. ఇవి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు. ఈ పోస్టులు రెజ్లింగ్, కబడ్డీ, కరాటే, ఆర్చరీ, వుషు, తైక్వాండో, జూడో, జిమ్నాస్టిక్స్ (పురుషులు), స్పోర్ట్స్ షూటింగ్, స్కీ, బాక్సింగ్, ఐస్ హాకీ (మహిళలు) కేటగిరీల్లో ఉన్నాయి. మరిన్ని వివరాలు.. దరఖాస్తులకు చివరి తేదీ: 2021 సెప్టెంబర్ 2 అర్హతలు: పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలిచి ఉండాలి.వయస్సు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మిగతా వారు రూ.100 చెల్లించాలి. వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in/
ITBP Recruitment: ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్.. రాత పరీక్ష లేదు
ABP Desam | 07 Jul 2021 04:23 PM (IST)
ITBP GD Constable Jobs 2021: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 65 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BSF
Published at: 07 Jul 2021 04:20 PM (IST)