ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇంజినీర్/ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇస్రో కేంద్రాల్లోని వివిధ విభాగాల్లో ఇంజినీర్/ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 68 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు గేట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 68
* సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులు.
విభాగాలు:
- ఎలక్ట్రానిక్స్: 21
- మెకానికల్: 33
- కంప్యూటర్ సైన్స్: 14
అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. గేట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 19.12.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు కనీస వేతనంగా నెలకు రూ.56,100 చెల్లిస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పీజు: రూ.250. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 29.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 19.12.2022.
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 21.12.2022
Also Read:
Navy Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TS: 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు ఇవే!
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-2,3,4 పోస్టులకు మరికొన్ని పోస్టులను చేర్చిన ప్రభుత్వం,తాజాగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి 9వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలోని గురుకులాల్లోనూ భారీగా పోస్టుల సంఖ్య పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన 9,096 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు అదనంగా దాదాపు 3 వేల పోస్టులు రానున్నాయి.
పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..