IRCON Recruitment: న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 75% మార్కులతో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ (సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 09 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 28


* అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు 


అర్హతలు: కనీసం 75% మార్కులతో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ (సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.


అనుభవం: హైవేలు/రైల్వేలు/వంతెనలు(రోడ్డు/రైలు/వయాడక్ట్)లో నిర్మాణ సంబంధిత కార్యకలాపాలలో అభ్యర్థికి కనీసం 2 సంవత్సరాల పోస్ట్-అర్హత అనుభవం ఉండాలి. 


వయోపరిమతి: 30 సంవత్సరాలు.


దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


వేతనం: నెలకు రూ.40,000 - రూ.1,40,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.02.2024. 


Notification (Regular)  


Website


 


* ఐఆర్‌సీఓఎన్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 
న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(ఇర్కాన్) ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్‌ అసిస్టెంట్‌, కంపెనీ సెక్రటరీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 04.


⏩ ఫైనాన్స్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు


అర్హతలు:  కనీసం 55% మార్కులతో ఫుల్ టైమ్ బీకామ్ లేదా ఎంకామ్ లేదా ఇంటర్మీడియట్(సీఏ/ఐసీఏఐ(సీఎంఏ)) ఉత్తీర్ణత ఉండాలి.


అనుభవం: అకౌంటింగ్, టాక్సేషన్, రిటర్న్స్ ఫైల్ చేయడం, ఏదైనా కంపెనీలో ఆడిట్ నిర్వహించడం / LLP రంగంలో కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమతి: 01.01.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.


వేతనం: నెలకు రూ.45,000. 


⏩ కంపెనీ సెక్రటరీ: 01 పోస్టు


అర్హతలు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌గా ఉండాలి.


అనుభవం: కో సెక్రటేరియల్‌గా రెండు సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి.


వయోపరిమతి: 01.01.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.


వేతనం: నెలకు రూ.48,000. 


⏩ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 02 పోస్టులు


అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇనిస్టిట్యూట్ నుంచి కనీసం 55% మార్కులతో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. 


అనుభవం: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధిత పనులలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.


వయోపరిమతి: 01.01.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.


వేతనం: నెలకు రూ.36,0000.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  
The Office of Chairman, 
Ircon Renewable Power Limited (IRPL), 
C-4, District Centre, Saket, New Delhi – 110017. 


ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తులకు చివరి తేది: 12.02.2024.


Notification (Contract) 


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...