హైదరాబాద్‌లోని ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఒప్పంద ప్రాతిపదికన జిల్లాలోని ఈఎస్ఐ హాస్పిటళ్లు/ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు/ ఈఎస్‌ఐ డయాగ్నస్టిక్ సెంటర్‌లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 114 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 28న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 114.
1) సివిల్ అసిస్టెంట్ సర్జన్: 59 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.58,850
2) డెంటల్ అసిస్టెంట్ సర్జన్: 01 పోస్టు
అర్హత: బీడీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.58,850
3) ల్యాబ్ టెక్నీషియన్: 11 పోస్టులు
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్ ఉండాలి.
జీతం: రూ. 31,040.
4) ఫార్మసిస్ట్: 43 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డీఫార్మసీ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన డిప్లొమా కలిగి ఉండాలి.
జీతం: రూ. 31,040.
వయోపరిమితి: 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి. దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా సంబంధిత చిరునామాకు పంపించాలి.
ఎంపిక విధానం: విద్యార్హతో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Joint Director (Medical),
Insurance Medical Services,
Hyderabad, 5th floor, Hostel Building,
ESI Hospital Sanathnagar Located at Nacharam,
Hyderabad- 500076.
ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.03.2023.
* దరఖాస్తుకు చివరి తేదీ: 28.03.2023 సాయింత్రం 5 గంటల వరకు.
Also Read:
నారాయణపేట జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు, దరఖాస్తుచేసుకోండి!
నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం జిల్లా పరిధిలోని పీహెచ్‌సీ/ డీహెచ్‌లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ నర్సింగ్/ జీఎన్‌ఎంతో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 29 వరకు దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..