గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫ్లాస్మా రిసెర్చ్(ఐపీఆర్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫకేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 51 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేయనున్నారు. 60 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాలి.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 51
* సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ సివిల్: 01
➥ కంప్యూటర్: 03
➥ ఎలక్ట్రికల్: 10
➥ ఇన్‌స్ట్రుమెంటేషన్: 05
➥ మెకానికల్: 10
➥ ఎలక్ట్రానిక్స్: 10
➥ ఫిజిక్స్: 12
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 18-30 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ/ఎస్టీ/మహిళా/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.35400 చెల్లిస్తారు.
దరఖాస్తు చివరి తేది: 15.03.2023
Also Read:
UPSC EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 577 ఖాళీలు, పూర్తి వివరాలు ఇలా!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 577 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 546 పోస్టులు, అర్హతలివే!
గుజరాత్‌లోని వడోదర ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీతోపాటు నిర్ణీత పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 28లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..