Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Continues below advertisement

ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Continues below advertisement

అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్‌మెంట్‌ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 350

1) నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు

2) నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): 30 పోస్టులు

3) యాంత్రిక్(మెకానికల్): 25 పోస్టులు

4) యాంత్రిక్(ఎలక్ట్రికల్): 20 పోస్టులు

5) యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు

అర్హత: నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టులకు ఇంటర్ (ఎంపీసీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదోతరగతి అర్హత ఉండాలి. ఇక యాంత్రిక్ పోస్టులకు పదోతరగతితోపాటు ఇంజినీరింగ్ డిప్లొమా(ఎలక్ట్రికల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.  01.05.2002 - 30.04.2006 మధ్య జన్మించి ఉండాలి.

పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అసెస్‌మెంట్‌ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08.09.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.09.2023.

Notification

Online Application

Website

ALSO READ:

ఎస్‌బీఐ పీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి  సెప్టెంబరు 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎస్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola