తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అక్టోబరు 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


పోస్టుల వివరాలు...

* స్టాఫ్ రిక్రూట్‌మెంట్


మొత్తం ఖాళీలు: 39


1) అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్)- గ్రూప్-ఎ: 02

2) జూనియర్‌ సూపరింటెండెంట్‌ (అడ్మినిస్ట్రేషన్)- గ్రూప్-బి: 05

3) జూనియర్‌ అసిస్టెంట్‌(అడ్మినిస్ట్రేషన్)- గ్రూప్-సి: 13


4) టెక్నికల్ ఆఫీసర్ (సిస్టమ్స్)- గ్రూప్-ఎ: 01

5) జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్- గ్రూప్-బి: 01

6) జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్- గ్రూప్-సి: 01

7) జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- గ్రూప్-బి: 06

8) జూనియర్ ఇంజినీర్- గ్రూప్-బి: 02

9) జూనియర్ టెక్నీషియన్- గ్రూప్-సి: 07

10) జూనియర్ హిందీ అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్/హిందీ)- గ్రేడ్-1: 01

అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఐటీఐ/బ్యాచిలర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/బీటెక్‌/డిప్లొమా/ఎంఎస్సీ/ఎంసీఏ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:
10.11.2022 నాటికి గ్రూప్-ఎ పోస్టులకు 45 సంవత్సరాలు, గ్రూప్-బి పోస్టులకు 32 సంవత్సరాలు, గ్రూప్-సి పోస్టులకు 27 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:
గ్రూప్-ఎ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ; గ్రూప్-బి, సి పోస్టులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
గ్రూప్-ఎ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.500, గ్రూప్-బి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.300, గ్రూప్-సి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. 

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.10.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:10.11.2022.

Notification

Website

Also Read:


CDAC: సీడాక్‌‌లో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు!
పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి


ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, ఈ అర్హతలు తప్పనిసరి!
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ), గ్రూప్- సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్‌తోపాటు సంబంధిత విభాగంలో రెగ్యులర్ కోర్సు లేదా డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 17 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశం ఉంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు!
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 346 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 20 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్య్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..