అగ్నిపథ్‌ పథకంలో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక ర్యాలీల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్ష ఫలితాలను మే 21న ప్రకటించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ (ఏఆర్‌వో).. తాజాగా నియామక ర్యాలీల తేదీలను విడుదల చేసింది. ఈ ర్యాలీలో భాగంగా రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శారీరక సామర్థ్య, వైద్య తదితర పరీక్షలు నిర్వహిస్తారు.


దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో జోన్ల వారీగా జూన్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్ణీత తేదీల్లో ర్యాలీ జరగనుంది. ఈ  నియామకాల్లో భాగంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. 


ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ర్యాలీలు ఇలా.. 


➥ ఏఆర్‌వో విశాఖపట్నం పరిధిలోని అభ్యర్థులకు జులై 20 నుంచి ఆగస్టు 2 వరకు విజయనగరంలో ర్యాలీ నిర్వహిస్తారు. విజయనగరంలో జరిగే ర్యాలీకి విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణా(విజయవాడ), యానాం (కేంద్రపాలిత ప్రాంతం) ప్రాంతాలకు చెందినవారు హాజరుకావాల్సి ఉంటుంది.


➥ ఏఆర్‌వో గుంటూరు పరిధిలోని అభ్యర్థులకు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 31 వరకు పల్నాడులో ర్యాలీ ఉంటుంది. పల్నాడులో జరిగే ర్యాలీకి గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, అనంతపురం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి ప్రాంతాలకు చెందిన అభ్యర్థలు హాజరుకావాల్సి ఉంటుంది.


➥ ఏఆర్‌వో సికింద్రాబాద్ పరిధిలోని అభ్యర్థులకు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు హకీంపేట్ (మేడ్చల్ మల్కాజ్‌గిరి)లో ర్యాలీ నిర్వహిస్తారు. హకీంపేటలో జరిగే ర్యాలీకి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు హాజరు కావాల్సి ఉంటుంది. 


Also Read:


ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐడీబీఐ బ్యాంకులో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 136 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మేనేజర్ పోస్టులకు రూ.48,170 - రూ.69810; అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.63,840- రూ.78,230; డిప్యూటీ జనరల్ మేనేజర్పోస్టులకు రూ.76,010- రూ.89,890గా ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..