India Post Payments Bank Limited Recruitment: న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.  ఎంపికైనవారికి ఢిల్లీ, ముంబయి, చెన్నైలలో పోస్టింగ్ ఇస్తారు.


వివరాలు.. 


* ఖాళీల సంఖ్య: 54


➥ ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్): 28 పోస్టులు


విభాగాలవారీగా ఖాళీలు: పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్-05, ఐటీ సపోర్ట్-23.


అర్హత: బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 22-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-10 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-13 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.


అనుభవం: ఏడాది.


➥ ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్): 21 పోస్టులు


విభాగాలవారీగా ఖాళీలు: పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్-02, ఐటీ సపోర్ట్-19.


అర్హత: బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 22-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-10 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-13 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.


అనుభవం: 4 సంవత్సరాలు.


➥ ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్): 05 పోస్టులు


విభాగాలవారీగా ఖాళీలు: పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్-01, కోర్ ఇన్స్యూరెన్స్ సొల్యూషన్-01, డేటా గవర్నెన్స్/ డేటాబేస్ యాక్టివిటీ మానిటరింగ్-01, డీసీ


మేనేజర్-01, ఛానల్స్ లీడ్-01.


అర్హత: బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 22-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-10 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-13 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.


అనుభవం: 6 సంవత్సరాలు.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. 


జీతం: ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టులకు ఎంపికైన వారికి రూ.10 లక్షలు; ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15 లక్షలు; ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టులకు రూ.25 లక్షలు వార్షికవేతనం(CTC) కింద ఇస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.05.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 24.05.2024. (11.59 PM)


Notification


Online Application


Detailed Guidelines and Procedures for Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..