India Post Gramin Dak Sevaks Recruitment Application 2025: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-1, జనవరి- 2025) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. దీనిద్వారా మొత్తం 21,413 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో బ్రాంచ్ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, డాక్‌ సేవక్‌ పోస్టులు ఉన్నాయి.  పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 10న ప్రారంభంకాగా.. మార్చి 03 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌- 1215, తెలంగాణ- 519 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.


వివరాలు..


* గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు


➥ బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)


➥ అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)


➥ డాక్‌ సేవక్‌


మొత్తం పోస్టుల సంఖ్య: 21,413.


తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు: ఏపీ-1,215, తెలంగాణ-519. 


పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-9735; ఓబీసీ-4164; ఎస్సీ-2867; ఎస్టీ-2086; ఈడబ్ల్యూఎస్-1952; పీడబ్ల్యూడీ(ఎ)-178; పీడబ్ల్యూడీ(బి)-195; పీడబ్ల్యూడీ(సి)-191; పీడబ్ల్యూడీ(డిఇ)-45.


సర్కిళ్లవారీగా ఖాళీలు..


ఆంధ్రప్రదేశ్: 1215 పోస్టులు


అస్సాం: 655 పోస్టులు


బిహార్: 783 పోస్టులు


ఛత్తీస్‌గఢ్: 638 పోస్టులు 


ఢిల్లీ: 30 పోస్టులు


గుజరాత్: 1203 పోస్టులు


హర్యానా: 82 పోస్టులు


హిమాచల్ ప్రదేశ్: 331 పోస్టులు


జమ్మూకశ్మీర్: 255 పోస్టులు


జార్ఖండ్: 822 పోస్టులు


కర్ణాటక: 1135 పోస్టులు


కేరళ: 1385 పోస్టులు


మధ్యప్రదేశ్: 1314 పోస్టులు


మహారాష్ట్ర: 1,498 పోస్టులు


నార్త్-ఈస్ట్రర్న్: 1260 పోస్టులు


ఒడిశా: 1101 పోస్టులు


పంజాబ్: 400 పోస్టులు


తమిళనాడు: 2292 పోస్టులు


ఉత్తర్ ప్రదేశ్: 3004 పోస్టులు


ఉత్తరాఖండ్: 568 పోస్టులు


వెస్ట్ బెంగాల్: 923 పోస్టులు


తెలంగాణ: 519 పోస్టులు


అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌ఉమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు చెల్లింపులు చేయాలి. ఇది పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: అభ్యర్థుల పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.


జీతభత్యాలు: నెలకు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌/ డాక్‌ సేవక్‌ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.


బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.


అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్టుమాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.


డాక్ సేవక్: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్ పథకాలు ప్రచారం చేయాలి.


ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు..


➥ మార్కుల సర్టిఫికేట్లు


➥ ఫొటో గుర్తింపు కార్డు


➥ క్యాస్ట్ సర్టిఫికేట్


➥ PWD సర్టిఫికేట్ (దివ్యాంగులైతే)


➥ EWS సర్టిఫికేట్ 


➥ ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్


➥ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం


➥ మెడికల్ సర్టిఫికేట్


➥ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు


ముఖ్యమైన తేదీలు..


✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2025.


✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 03.03.2025.


✦ దరఖాస్తుల సవరణ: 06.03.2025 - 08.03.2025.


Notification


Circlewise Vacancy Details


Online Application


Fee Payment


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...