ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి ఐదో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 



దేశంలోని వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో భారత తపాలా శాఖ 40,889 నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.  ఐదో జాబితాకు ఏపీ నుంచి 219మంది; తెలంగాణ నుంచి 175మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయ్యారు. 


ఏపీ జీడీఎస్ ఫలితాలు (ఐదో జాబితా)..


తెలంగాణ జీడీఎస్ ఫలితాలు (ఐదో జాబితా)..


 


జులై 08 లోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి...
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు జులై 08లోగా సంబంధిత డివిజన్ హెడ్ ముందు తమ సర్టిఫికేట్లను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటాక ఎట్టిపరిస్థితుల్లోనూ ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతించరు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను, ఒక జత జిరాక్స్ కాపీలను, ఫోటోలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.  


పోస్టులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్‌ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్‌ ప్రాతిపదికన బోర్డింగ్‌, లాడ్జింగ్‌ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial